![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -363 లో.....రామ్ కి ఏదో చెప్పి నువ్వు పంపించేసావ్.. ఏం చెప్పావ్ రామ్ కి అంటూ శ్రీలత వాళ్ళు రామలక్ష్మిని నిలదీస్తుంటారు. ఇప్పుడు ఇదంతా డిస్కషన్ ఎందుకు.. ముందు రామ్ ని వెతకాలి అంటూ ఒకవైపు రామలక్ష్మి, మరొక వైపు సీతాకాంత్ లు రామ్ ని వెతికే పనిలో పడతారు. రామలక్ష్మికి ఎవరో ఫోన్ చెయ్యగానే ఫణీంద్ర వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. వెళ్లేసరికి ఫణింద్ర వాళ్ళ దగ్గర రామ్ ఉంటాడు.
రామ్ ని చూసి రామలక్ష్మి హ్యాపీగా ఫీల్ అవుతుంది. సీతాకాంత్ టెన్షన్ పడుతాడేమోనని రామలక్ష్మి తనకి ఫోన్ చేస్తుంది. రామ్ ఉన్నాడని చెప్పగానే సీతాకాంత్ కూల్ అవుతాడు. వెంటనే రామ్ దగ్గరికి సీతాకాంత్ వెళ్తాడు. ఎక్కడికి వెళ్ళావ్ నాన్న ఎవరికి చెప్పకుండా అని రామ్ ని సీతాకాంత్ అడుగగా.. నీ పక్కన రమ్య ఉండడం నాకిష్టం లేదు.. అందుకే అని రామ్ అనగానే.. సీతాకాంత్ షాక్ అవుతాడు. ఆ తర్వాత రామ్ ని తీసుకొని సీతాకాంత్ ఇంటికి వస్తాడు. ఎక్కడికి వెళ్ళావ్ రా అంటూ రామ్ పై కోప్పడుతుంది శ్రీలత.నాన్నని ఏం అనకు అని శ్రీలతపై సీతాకాంత్ కోప్పడతాడు. ఇప్పటివరకు ఎక్కడికి వెళ్ళాడన్న కోపంతోనే శ్రీలత గారు అలా అన్నారు.. నేను కూడా బాబు విషయంలో తొందరపడ్డానని రమ్య అంటుంది. అసలు ఎందుకు వెళ్ళావని శ్రీవల్లి అడుగగా.. నాకు ఈ రమ్య ఇష్టం లేదు, అందుకే అని రామ్ అనగానే.. అందరు షాక్ అవుతారు. ఇక్కడితో ఈ విషయం వదిలెయ్యండి అని సీతాకాంత్ అంటాడు. ఆ తర్వాత అసలు ఎందుకు రమ్య ఇష్టం లేదని రామ్ ని సీతాకాంత్ అడుగుతాడు. నీకు సూట్ అవ్వదని రామ్ చెప్తాడు. మరి ఎవరు సూట్ అవుతారని సీతాకాంత్ అడుగగా.. మా మిస్ అని రామ్ అంటాడు. ఎందుకని సీతాకాంత్ అనగా... సీతాకాంత్ ని తీసుకొని రామలక్ష్మి ఫోటో దగ్గరికి రామ్ వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |